ఇదిగో నిన్నే

ఇదిగో నిన్నే

ఇదిగో నిన్నే

 

        ఇదిగో నిన్నే

        నిన్ను నువ్వే ఎన్ని సార్లు పిలుచుకున్నా బోరు కొట్టదులే.

        నువ్వు చెప్పినవన్నీ బాగానా ఉంటాయి నీకు

        నువ్వు విన్నవి మాత్రం బాగుండవు నీకు.

        నీ రాతలన్నీ, అబ్బో అబ్బో, ఎంత బాగుంటాయో నీకు.

        నువ్వు చదివే రాతలన్నీ చెత్త. కళ్ళు చికిలిస్తావు, కనుబొమ్మలు పైకెత్త్ ఏంటిది అన్నట్లు చూస్తావు.

        నీకు నచ్చేది ఈ భూప్రపంచంలో ఒక్కటే ఒకటి ఉంది. అదే అద్దం!

        నీకు నువ్వు తప్ప మరేమి నచ్చుతుంది.

        ఇదిగో నిన్నే. నిన్ను నువ్వు అయినా పిలవక, నిన్ను నువ్వైనా చూడక, నీతో నువ్వైనా మాట్లాడక పోతే ఎలా?

        నీ చుట్టూ జరిగే సంఘటనలన్నీ నువ్వు సాక్షీ భూతంగా చూస్తావు. నీకు న్చ్చుతుందో నచ్చదో నీ చుట్టూ ఉండే వాళ్ళకి ఎప్పటికీ సందేహమే!

        ఆ రోజు నువ్వు నీ గదిలో ఉంటే కిటీకీలోనుంచి ఎవరో నిన్ను చూసి వెళ్ళారు. తలుపులు వేసి ఉన్నా తలపులు వేయలేము కదా. కిటికీ రెక్కలన్నా వేసావు కాదు నువ్వు. నీ పక్కింటి వాళ్ళో ఎదురింటి వాళ్ళో నిన్ను మాట్లాడించాలని చూస్తే...

        ఇదిగో నిన్నే...మళ్ళీ ఏదో ఆలోచనలలోకి జారిపోయి నిన్ను నువ్వే జారవిడుచుకుంటున్నావు.

        నిన్ను పట్టుకోవడం కష్టమే సుమా!

        నిన్ను నువ్వు గాక మరెవరూ పట్టలేరు. అద్దం కూడా!

        అది నిన్ను నిన్నుగానే చూపిస్తుందా?

        లేక నువ్వు ఎలా ఉండాలనుకున్నావో అలా చూపిస్తుందా?

        నువ్వు ఎలా ఉంటేనేం. నీకు నువ్వు నీలాగా కనిపిస్తున్నావా లేదా అనేది ముఖ్యం.

        నువ్వు నీకొసం ఎన్ని చేసినా నువ్వుగానే మిగిలిపోతావు.

        అసలు నువ్వు ఏమన్నావు?

        ఏమన్నావని ఇంత గొడవ జరిగింది.

        నిన్ను అనలేక, అంటే నువ్వు ఏమంటావో అనే భయం వల్ల,

        నీకు తెలియని విషయాలను

        తీసుకొచ్చి నిన్ను కన్ఫ్యూజ్ చేస్తే?

        చేస్తే మాత్రం నీకు నష్టమా?

        నువ్వు కన్ఫ్యూజ్ అయినా అవ్వకపోయినా నీ తీరు ఇంతేగా?!

        నువ్వు నవ్వితే బాగుంటావని అద్దం చెప్పిందా నీకు?

        ముసి ముసి నవ్వుల వల్ల నీ ముఖ విలువ పెరగడానికి నువ్వేమైనా షేర్ వా?

        నీకు ఏమి చెప్పినా ఎంత చెప్పినా నువ్వు నవ్వుతావు

        నీకు చెప్పక పోయినా, చెప్పినా కన్‍ఫ్యూజ్ అవుతూనే ఉంటావు.

        అది నిజంగా చెప్పాలంటే నీ జన్మ హక్కు.

        నువ్వు ఎప్పటికి, ఇదిగో నిన్నే,

        నువ్వు ఎప్పటికీ, ఇదిగో ఆలోచనలలోకి జారిపోకు...

        నువ్వు ఎప్పటికీ నువ్వే సుమా!